
టాలెంటెడ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. దేశవాలీ క్రికెట్లో అత్యధిక సగటు నమోదు చేసిన భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం రంజీ టోర్నీ ఆడుతున్న సర్ఫరాజ్..ముంబై తరపున ఉత్తరాఖండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 153 పరుగులతో చెలరేగాడు. ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్కు ఇది మూడో సెంచరీ. మొత్తంగా ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్లలో అతను 704 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్సమన్ డాన్ బ్రాడ్‌మన్ సగటు 95.14 తర్వాత రెండో అత్యధిక సగటు 80.42 సర్ఫరాజ్ పేరిట నమోదవడం విశేషం.
లాస్ట్ సీజన్లోనూ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. 6 మ్యాచుల్లో 928 పరుగులు కొట్టాడు. అంతేకాదు ట్రిపుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ బీసీసీఐ నుంచి పిలుపువచ్చే ఛాన్సుంది. త్వరలో ఇంగ్లాండ్, వెస్టిండీస్తో పాటు..టీ-20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇక 2014 ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్..ఇప్పటి వరకు 22 మ్యాచుల్లో 2099 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలున్నాయి. లిస్ట్-A క్రికెట్లో 21 మ్యాచులు ఆడి..ఒక సెంచరీతో 325 పరుగులే చేశాడు. ఇక 74 టీ-20 మ్యాచుల్లో 872 పరుగులు కొట్టాడు. ఇందులో 3 అర్థసెంచరీలున్నాయి.