మనం నిమిషానికి 15 నుంచి 20 సార్లు మనకు తెలియకుండానే కళ్ళు ఆర్పుతాం. అలా కాదని బలవంతంగా ట్రై చేస్తే మహా అయితే ఒక నిమిషం పాటు కళ్ళు ఆర్పకుండా ఉండగలం. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫిలిప్పీన్స్ యాక్టర్ మాత్రం ఏకంగా గంటా పదిహేడు నిమిషాలు కళ్ళు ఆర్పకుండా ఉండగలడు. పాలో బల్లెస్టెరోస్ యాక్టర్‌గా, కమెడియన్‌గా, టీవీ హోస్ట్‌గా ఫిలిప్పీన్స్‌లో ఎంతో ఫేమస్. రీసెంట్గా తను హోస్ట్ చేస్తున్న ‘ఈట్ బులాగా’ అనే టీవీ షోలో ‘ నో బ్లింకింగ్ ఛాలెంజ్’ ని యాక్సెప్ట్ చేశాడు పాలో. అందరూ ఓ ఐదారు నిమిషాలు ఉండగలడేమో అనుకున్నారు. ఏకంగా గంటా 17 నిమిషాల పాటు కళ్ళు ఆర్పకుండా ఉన్నాడు పాలో. ఇప్పటి వరకు ఎవరి పేరునా ఇలాంటి రికార్డు లేదు. దాంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ యాక్టర్ పేరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
