భార్య ఫోన్ కాల్స్ రికార్డు చేయడం తప్పు

భార్య ఫోన్ కాల్స్ రికార్డు చేయడం తప్పు

చండీగఢ్: దొంగచాటుగా భార్య ఫోన్ సంభాషణలను రికార్డు చేయడం తప్పేనని పంజాబ్, హరియాణా హైకోర్టు తెలిపింది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతకు భంగం కలిగించినట్లే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు వాదనల సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పైవ్యాఖ్య చేశారు. భార్య ఫోన్ రికార్డుల్లోని మాటలకు సంబంధించిన సీడీని సమర్పిస్తానని భర్త చెప్పగా భటిండాలోని ఫ్యామిలీ కోర్టు అంగీకరించింది. అయితే తన పర్మిషన్ లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా పరిగణించకూడదని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. సెక్షన్ 65 ప్రకారం సెల్ ఫోన్లలో రికార్డు చేసిన సంభాషణలను సాక్ష్యంగా పరిగణించకూడదని, కానీ కుటుంబ న్యాయస్థానం దీన్ని పట్టించుకోలేదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. చాలా క్రూరంగా హింసించడం వల్లే దీన్ని రికార్డు చేయాల్సి వచ్చిందని భర్త తరఫు అడ్వకేట్ వాదించారు. దీంతో ఏకీభవించని జడ్జి.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించారు.