
సెలవుల్లో బతుకమ్మ ఉత్సవాలు, దసరా పండుగను కోలాహలంగా జరుపుకోవాలనుకున్న వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ కేంద్రం. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని.. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఉరుములు మెరుపులతో కూడిన జడివానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మరో 14 జిల్లాలకు ఆరెంజ్ ప్రకటించారు అధికారులు. తెలంగాణలో 14 జిల్లాల్లో మోస్తరు నంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఇవాళ, రేపు (సెప్టెంబర్ 26, 27) భారీ వర్షాలు ఉన్నందున వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. భారీ వర్షాలు ఉన్నందున తాక్కాలికంగా అంనంతగిరి పర్యాటక కేంద్రాన్ని, కోట్పల్లి ప్రాజెక్టును మూసివేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో శుక్రవారం (సెప్టెంబర్ 26) నస్కల్ వాగును పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలను ఎప్పటికప్పుడు పోలీసుల భద్రతతో పర్యావేక్షిస్తున్నామని ప్రజలు అవసరమైతే తప్ప ఇల్లలోంచి బయటికి రావద్దని సూచించారు ఎస్పీ నారాయణరెడ్డి.
పర్యాటకులు ఎవరు కూడ వికారాబాద్ కు రావద్దని సూచించారు కలెక్టర్. భారి వర్షాలతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగాని అలెర్ట్ చేశామని.. వాగుల దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎవరు కూడ వాగులు దాటొద్దని సూచించారు ఎస్పీ నారాయణరెడ్డి.