రెడ్‌ అలర్ట్‌ : ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

రెడ్‌ అలర్ట్‌ : ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం మహారాష్ట్రలోని శివారు ప్రాంతాలతో పాటు మరికొన్నిఏరియాల్లో భారీ వానలు ముంచెత్తుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో జూన్‌ 13, 14 తేదీల్లో భారత వాతావరణ శాఖ (IMD) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వర్షాల కారణంగా  ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. తూర్పు సియోన్‌లోని అంధేరిలో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మోకాళ్ల లోతుకు పైగా రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో..వాహనాలు ఎక్కడి కక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది.

ముంబైలో నిన్న(శుక్రవారం) సాయంత్రం 5.30 గంటల వరకు 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు IMD తెలిపింది. దీంతో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లరాదని ప్రజలకు బృహన్‌  ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షం దృష్ట్యా NDRFకు చెందిన ఐదు జట్లను ముంబైలో హై అలర్జ్‌ చేసింది. అనేక జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్రలో మొత్తం 15 NDRF బృందాలను మోహరింపజేసింది.