పాక్ వక్రబుద్ది..మరోసారి కాల్పుల విమరణ ఉల్లంఘన..సాంబా సెక్టార్ లో డ్రోన్లతో దాడి

పాక్ వక్రబుద్ది..మరోసారి కాల్పుల విమరణ ఉల్లంఘన..సాంబా సెక్టార్ లో డ్రోన్లతో దాడి

కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడింది. కోలుకోలేని దెబ్బ తిన్నా  వక్రబుద్ది మార్చుకోని పాకిస్తాన్ సోమవారం(మే12) రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో  డ్రోన్లతో దాడి చేసింది. దాదాపు 15 నిమిషాలపాటు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. భారత్, పాక్ డ్రోన్ దాడులను తిప్పికొట్టింది. సాంబాలో బ్లాక్ అవుట్ మధ్య ఒక్కొక్క డ్రోన్ ను భారత రక్షణ వ్యవస్థ కూల్చివేస్తున్న దృశ్యాలు బయటికొచ్చాయి.   

#WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.

(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs

— ANI (@ANI) May 12, 2025

సాంబాలో బ్లాక్ అవుట్ మధ్య భారత్  వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకుంటుండగా ఎర్రటి చారలు కనిపించాయి. భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత మొదటిసారి శనివారం డ్రోన్లతో దాడి చేసింది పాక్. భారత్ వైమానిక రక్షణ దళాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. సరిహద్దు వెంట పాక్ దాడులకు ఓ జవాన్ వీరమణం పొందారు. ఇప్పుడు సాంబాలో మరోసారి దాడులకు దిగింది.