హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో జనం జంకుతున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలన్నా…అలాంటి పరిస్థితిల్లో జర్నీ చేయాలన్నా ప్రజలు వెనుకాడుతున్నారు. లేటెస్టుగా కరోనా వైరస్ ఎఫెక్ట్ మెట్రోరైలు పై పడింది. దీంతో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. కరోనా భయంతో 10వేల మంది ప్రయాణికులు తగ్గారని మెట్రో రైల్ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే..కరోనా భయంకరమైనది కాదని, ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైల్ కోచ్‌లను శుభ్రం చేస్తున్నామన్నారు. సర్వీసులు ముగిసిన తర్వాత ఆటో కెమికల్స్‌తో క్లీన్ చేస్తున్నామన్నారు. ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
