
- వాగులో దిగి రీల్స్ చేస్తుండగా నీటిలో పడి యువకుడు మృతి
- కరీంనగర్ శివారులోని మానేరు వద్ద ఘటన
కరీంనగర్ క్రైమ్, వెలుగు: రీల్స్ కోసం వాగులోకి దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహ్మద్ అర్బాస్ (20) గురువారం తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రీల్స్ చేసేందుకు మానేరు బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. మానేరు వాగులోకి దిగి రీల్స్ చేస్తున్న అర్బాస్ ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు. గమనించిన అతడి ఫ్రెండ్స్ స్థానికులకు విషయం చెప్పగా.. వారు వచ్చి అర్బాస్‌ను బయటకు తీసి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. మృతుడి తండ్రి లతీఫ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.