ములుగు జిల్లా పేరు మార్చడానికి ప్రజాభిప్రాయస్వీకరణ

ములుగు జిల్లా పేరు మార్చడానికి ప్రజాభిప్రాయస్వీకరణ

ములుగు జిల్లా: తెలంగాణలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన ములుగు జిల్లా పేరును సమ్మక్క -సారలమ్మ జిల్లా గా మార్చుటకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాల స్వీకరణ చేపడుతున్నామన్న జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర సోమవారం ప్రకటించారు. ములుగు జిల్లాని సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మార్చడంలో ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల ద్వారా  తెలియజేయాలని కలెక్టర్ ప్రజల్ని కోరారు. మంత్రి సీతక్క ప్రతిపాదనల మేరకు ప్రజాభిప్రాయ స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ను విడుదల చేసిన ములుగు జిల్లా కలెక్టర్ తెలిపారు.