బంజారాహిల్స్ లో 90 మంది రౌడీల హల్ చల్

బంజారాహిల్స్ లో  90 మంది రౌడీల హల్ చల్

బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో రాయలసీమ ముఠా హల్ చల్ చేసింది.  AP జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్ కు 2005లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రోడ్డుకు ఆనుకోని మరో అర ఎకరానికి పైగా ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం తమదేనంటూ టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మనుషులు…. కొద్ది రోజుల క్రితం డెవలప్మెంట్ పేరుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఖాళీ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని హల్చల్ చేశారు. స్థలంలో అప్పటకే ఉన్న సెక్యూరిటీపై దాడికి పాల్పడారు. 

విషయం తెలియటంతో... పోలీసులు అక్కడికి చేరుకొనే సరికి కొంతమంది పరారయ్యాయారు. ఈ కేసులో 58 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు బంజారాహిల్స్ పోలీసులు. స్థలం విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. గతంలోనూ ఈ స్థలంపై పలు కేసులున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాదు ల్యాండ్ కబ్జా కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు TG వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ పై కేసు నమోదైంది.