ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ పోలింగ్ మందకోడిగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే చలి తగ్గిన తర్వాత మెల్లగా జనాలు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 15.4 శాతం ఓటింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 16 శాతం, నల్లొండ జిల్లాలో 17 శాతం, నిజామాబాద్ జిల్లాలో 17 శాతం, కొత్తపల్లిలో 40 శాతం, నాగర్ కర్నూల్‌లో 40 శాతం, రంగారెడ్డిలో 16 శాతం, వనపర్తిలో 13 శాతం, మేడ్చల్‌లో 12 శాతం, వికారాబాద్‌లో 14 శాతం, మహబూబ్ నగర్‌లో 23 శాతం, యాదాద్రి భువనగిరిలో 15 శాతం, సంగారెడ్డిలో 18 శాతం, బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్‌లో 9 శాతం, రామగుండం కార్పొరేషన్‌లో 13 శాతం, హుస్నాబాద్‌లో 49 శాతం, వేములవాడలో 42 శాతం, కోరుట్లలో 33 శాతం, మెట్ పల్లిలో 32 శాతం, హుజురాబాద్‌లో 40 శాతం, ఎల్లారెడ్డిలో 43 శాతం, బాన్సువాడలో 42 శాతం, బోధన్‌లో 36 శాతంగా నమోదయ్యాయి.