భువనగిరిలో రాత్రి పది దాటినా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు

భువనగిరిలో రాత్రి పది దాటినా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు

యాదాద్రి జిల్లా భువనగిరిలో రాత్రి పది దాటినా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. సాధారణంగా సాయంత్రం 5 గంటలకే రిజిస్ట్రేషన్ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. కానీ భువనగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో మాత్రం 10 దాటినా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించారు సిబ్బంది. వడాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని 518 సర్వే నంబర్ లో అనుమతి లేని లేఔట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. లేఔట్, LRS, మున్సిపల్ యాక్టులను ఉల్లంఘించి వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు సమాచారం. మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్... రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కానీ.. నిన్న ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ డ్యూటీలో ఉన్నారు. ఎల్పీ నంబర్ లేని లే ఔట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు...రిజిస్ట్రార్ కావాలనే సెలవులో వెళ్లి.. ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ కు బాధ్యతలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండటాన్ని గుర్తించిన ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికే ఆఫీస్ సిబ్బంది, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.