హైదరాబాద్‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్‌ ఫ్రారంభమైన సన్నీ డియోల్ మూవీ

హైదరాబాద్‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్‌ ఫ్రారంభమైన  సన్నీ డియోల్ మూవీ

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని ఓ హిందీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రీసెంట్‌‌‌‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, శనివారం నుంచి హైదరాబాద్‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను మొదలుపెట్టారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జా డ్రాపింగ్‌‌‌‌ స్టంట్ మాస్టర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. 

లార్జర్ దేన్ లైఫ్‌‌‌‌గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లు ప్రేక్షకులకు మొదటి నుండి చివరి వరకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ అందించనున్నాయని, సన్నీ డియోల్ తన పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌‌‌‌తో ఆకట్టుకుంటారని మేకర్స్ చెబుతున్నారు.  సయామి ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.