సింగరేణిలో బదిలీ వర్కర్లు రెగ్యులరైజ్

సింగరేణిలో బదిలీ వర్కర్లు రెగ్యులరైజ్

హైదరాబాద్, వెలుగు :  సింగరేణి సంస్థలో  బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న 2,266 మందిని జనరల్​మజ్దూర్​లుగా క్రమబద్దీకరిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్​1వ తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

అండర్​గ్రౌండ్​మైన్స్​లో ఏడాదికి 190 రోజులు, ఓపెన్​కాస్టులు, ఇతర విభాగాల్లో 240 రోజులు పని చేసిన వారికి ఈ అవకాశం కల్పించారు. 2017 నుంచి ఇప్పటి వరకు సంస్థలో 13,981 మంది బదిలీ వర్కర్లను జనరల్​మజ్దూర్​లుగా రెగ్యులరైజ్​చేసినట్టు సంస్థ ఒక ప్రకటనలో  తెలిపింది.