కష్టమే… అయినా ఇష్టమే

కష్టమే… అయినా ఇష్టమే

‘ఎప్పుడూ ఆనందంగా అల్లరి చేస్తూ కనిపించే పావని ఇప్పుడు మౌనంగా ఉంటోంది. ఇరవై రోజుల పి ల్లాడికి పాలిస్తూనే తరచూ ఏడుస్తోంది.ఏమైందని ఎవ్వరడిగినా చెప్పట్లేదు. ప్రతిదానికీ
చిరాకు పడుతోంది. చంటిపిల్లాడిపై కూడా కోప్పడుతోంది. పావని ఎందుకలా చేస్తోందని ఆమె తల్లి డాక్టర్‌‌ని అడిగితే..‘‘అవి పోస్ట్‌ పార్టమ్‌
బ్లూస్‌‌… మానసికంగా ఆనందంగా ఉంటే అవి తగ్గిపోతాయి’’ అని చెప్పింది’. డెలివరీ తర్వాత కొంతమంది తల్లుల్లో కనిపించే మానసిక సమస్యే ఈ పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ . ఇదొక్కటే కాదు..ఎన్నో సమస్యలు ప్రెగ్నెన్సీ , డెలివరీ సమయాల్లో వస్తుంటాయి.

అలాగే సన్నగా… నాజూగ్గా ఉండేది దివ్య. ప్రెగ్నెన్సీ తర్వాత బాగా లా వెక్కింది. చంటిపాప పుట్టిన ఆనందంలో ఆ సంగతే మర్చిపోయింది. పాప కొంచెం పెద్దయ్యాక… తనను తానుచూసుకుంది. అప్పుడు ఫీలయ్యింది లా వుగా ఉన్నానని. ఏ రోజుకు ఆ రోజు వ్ యాయామం చేయాలనుకుంటోంది. చాలా రోజుల అలా అనుకుంటూనే ఉంది. ఎట్టకేలకు వ్ యాయామం చేయడం ప్రారంభించింది. మెల్లిమెల్లిగా బరువు తగ్గుతూవస్తోంది. ఇలా పావని, దివ్యలే కాదు… కొత్తగా తల్లైన ప్రతి ఒక్కరికీ ఒక్కో సమస్య ఉంటుం ది. అయినా వాటిని పి ల్లల కోసం హాయిగా అనుభవిస్తామంటున్నారు . మరి కొం దరు తల్లులు ఏమంటున్నారో చదవండి. ‘అమ్మా’ అని పిలిపించు కోవడం ఓ గొప్ప వరంగా భావిస్తా రు మహిళలు. అందుకోసం ఎంత నొప్పి నైనా భరిస్తా రు. శరీరంలో ఎన్ని మార్పులకైనా సిద్ధపడతారు. బిడ్డ కడుపులో పడిన దగ్గరి నుంచి ప్రతిరోజూ ఒక కొత్త పరీక్షను ఎదుర్కొంటారు. మొదటి కొన్ని నెలలు వాంతులు, వికారంతో…తర్వాత నెలలు కాన్పు గురించి భయపడుతూ ఉంటారు. అంతేనా… భరించలేని పురిటి నొప్పులను తట్టు కుని బిడ్డకు జన్మనిస్తారు. అప్పటివరకూ లేని కొత్త సమస్యలను సైతం తెచ్చుకోవడానికి సిద్ధపడతారు. అందులో ముఖ్యమైనవి అధిక బరువు, స్ట్రెచ్‌ మార్క్స్‌ (ఒంటిపై చారలు), పోస్ట్‌‌పార్టమ్‌ బ్లూస్‌‌ లేదా డిప్రెషన్‌ వంటివి వేధిస్తుం టాయి. అయితే అమ్మదనం కోసం వేటినైనా ఇష్టపడతామంటున్నారు తల్లులు.

 

పిల్లల ముందు అవన్నీ చిన్నవే లేబర్‌‌ పెయిన్స్‌ అయినా.. అధిక బరువైనా రెండూ కష్టమే.అయితే డెలివరీకి ముందు పడిన కష్టమంతా పిల్లల్ నిచూడగానే మర్చిపోతాం. వాళ్లను చూస్తే ఆ బాధలేవీ గుర్తు రావు. మా పెద్ద పాప పుట్టేటప్పుడు అనిపించింది… ‘ఏంట్రా దేవుడా ఈ బాధ. మగాళ్లు హాయిగా ఉంటారు. మనకే ఇలాంటి నొప్పులన్నీ’ అనిపించింది. కానీ అది దేవుడి సృష్టి కదా.మనమేం చేస్తాం .
– శిరీష

బరువు తగ్గడం అంత ఈజీ కాదు తల్లి అయ్యాక మానసికంగా, శారీరకంగా చాలా మార్పులొస్తా యి. మొదటి ప్రెగ్నెన్సీ అప్పడు మార్నింగ్‌ సిక్‌ నెస్‌‌,
వీక్‌ నెస్‌‌తో ఇబ్బంది పడ్డా. రెండోసారి యాక్టివ్‌ గానే ఉన్నా. అయితే బరువు మాత్రం బాగా పెరిగాను. వ్యాయామం చేయాలంటే ఇబ్బంది అవుతోంది. టైమంతా పిల్లల్ని చూసుకోవడంలోనే సరిపోతోంది. అయినా బరువు తగ్గడానికి కష్టపడుతున్నా.
– అరుణ

చాలామంది అంటుంటారు ప్రెగ్నెన్సీతో శరీరంలో వచ్చే మార్పులకు హ్యాపీగానే ఉన్నా.అమ్మదనాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నా . కానీ కొన్ని డ్రెస్సులు సరిపోనప్పుడు, వాళ్లూ వీళ్లూ అంటున్నప్పుడు మాత్రం బరువు గుర్తొచ్చి బాధేస్తది. తర్వాత మళ్లీ బాబుని చూసినప్పుడు అంతా
వాడి కోసమే కదా అనుకుం టా. మెల్లిమెల్లిగా బరువు తగ్గడానికే ప్రయత్నిస్తున్నా .
– తులసి