ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

V6 Velugu Posted on Oct 23, 2021

అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగిన  ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్ పరీక్షకు 3 లక్షల 24 వేల 800 మంది విద్యార్థులు, సెకండియర్‌ పరీక్షకు 14 వేల 950 మంది విద్యార్థులు హాజరయ్యారు.

మార్కుల రీ వెరిఫికేషన్ (పునః పరిశీలన)కు, రీకౌంటింగ్ ( పునః లెక్కింపు)కు ఈనెల 26 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఒక్క పేపర్ పునః లెక్కింపు (రీ కౌంటింగ్)కు పేపర్ కు రూ.260 చొప్పున, పునః పరిశీలనకు (రీ వెరిఫికేషన్)కు పేపర్ కు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామక్రిష్ణ తెలిపారు.

విద్యార్థుల మార్కుల మెమోలను ఈనెల 25వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ‘https:bie.ap.gov.in’ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్ల‌కు సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డ కార్యదర్శి సూచించారు.
 

Tagged VIjayawada, Amaravati, intermediate results, Inter Results, , ap updates, bejawada, inter advanced supplementary exams

Latest Videos

Subscribe Now

More News