మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లుల విడుదల పూర్తిగా అబద్ధం : తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ

మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లుల విడుదల పూర్తిగా అబద్ధం : తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు అందాయని చెప్పారు.

హైదరాబాద్ లోని గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఎస్ఎఫ్​సీ కింద తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేశామన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కొంతమంది సర్పంచులు ఆత్మహత్య  చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.