జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు జీడిమెట్ల సర్వీస్ సొసైటీ తెలిపింది. ఇందుకోసం రూ.93 లక్షలు మంజూరయ్యాయని, 150 కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. మంగళవారం జీడిమెట్ల సర్వీస్సొసైటీ ఆఫీసులో బాలానగర్ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సీఐలు శ్రీనివాసరావు, శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు జీడిమెట్ల ఇండస్ట్రియల్ఎస్టేట్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ట్రాఫిక్ జామ్తోపాటు గంజాయి విక్రయాలు పెరిగాయని తెలిపారు. కార్యక్రమంలో ఐలా కమిషనర్ నజీర్ అహ్మద్, వైస్ చైర్మన్ఎ.ఎల్.ఎన్రెడ్డి, సెక్రటరీ సాయికిషోర్, భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు.
