భారీగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను ..నియమించుకోనున్న రిలయన్స్

భారీగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను ..నియమించుకోనున్న రిలయన్స్

 న్యూఢిల్లీ :  మనదేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఇది పెట్రోకెమికల్స్ నుంచి న్యూ ఎనర్జీ వరకు... అన్ని వర్టికల్స్​లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఇందుకోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (జీఈటీ) 2024 ప్రోగ్రామ్ పేరుతో  ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది.

 ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ జనవరి 11 నుంచి ప్రారంభమైందని,  జనవరి 19 వరకు ఉంటుందని సంస్థ తన వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.   ప్రతి యువ ఇంజినీరింగ్ స్టూడెంట్​కు సమాన అవకాశాలను అందించడానికి జీఈటీ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. చిన్న పట్టణాల వాళ్లకు,  టాప్ 50 లేదా 100 ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌లకు చెందిన యువకులకు రిలయన్స్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచస్థాయి శిక్షణ,  ఉపాధి అవకాశాలు ఇస్తారు.    

ఈ కార్యక్రమం కింద, రిలయన్స్ బీటెక్​, బీఈ స్టూడెంట్ల నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏఐసీఈటీ -ఆమోదిత సంస్థల నుంచి కెమిస్ట్రీ​, ఎలక్ట్రికల్, మెకానికల్  ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంటేషన్ వంటి వివిధ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌లకు చెందిన 2024 బ్యాచ్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. షార్ట్‌‌‌‌‌‌‌‌లిస్ట్ అయిన వాళ్లకు ఫిబ్రవరి 5–8 కాగ్నిటివ్ టెస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలకు రావాలి. మార్చిలోపు ఉద్యోగాలు ఇస్తారు.