
న్యూఢిల్లీ: ఎయిరెటెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన కొన్ని రోజులకే జియో కూడా ఇదే బాట పట్టింది. అన్ని ప్రీపెయిడ్, జియోఫోన్, డేటా యాడ్ -ఆన్ ప్లాన్ల రీచార్జ్ రేట్లను 25 శాతం వరకు పెంచింది. కొత్త రేట్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయి. పాత ప్లాన్లలో రీఛార్జ్ చేసుకోవడానికి ఈ నెల 31 దాకా సమయం ఉంటుంది. 28- రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రేటును రూ. 129 నుండి రూ. 155కు పెంచారు. 24 రోజుల వాలిడిటీ ఉండే 1జీబీ/ ఒక రోజు ప్లాన్ ధరను రూ.149 నుంచి రూ. 179కు పెంచారు. రూ. 199 ప్లాన్‌కు ఇక నుంచి రూ. రూ. 239 కట్టాలి. ఇది 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా అందిస్తుంది. రూ. 249 ప్లాన్ ధరను రూ. 299కి పెంచారు.