న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. అమెరికా విధిస్తున్న ఆంక్షల గడువు ఈనెల 19తో ముగుస్తున్నందున నాలుగు నౌకల ద్వారా చమురు తీసుకురావాలని భావిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఈ కొనుగోళ్లు సాగేలా సంస్థ జాగ్రత్త పడుతోంది. హోర్మూజ్ జలసంధి వద్ద తలెత్తిన ఆటంకాల వల్ల చమురు సరఫరా తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇదిలా ఉంటే, తాము నిర్వహిస్తున్న పెట్రోల్బంకుల్లో ధరలను పెంచబోమని రిలయన్స్ వివరణ ఇచ్చింది.
