హెచ్1బీ వీసా ఫీజుపై ఊరట.. వీసా సవరణలు, ఎక్స్టెన్షన్కు లక్ష డాలర్ల ఫీజు పెంపు నుంచి మినహాయింపు

హెచ్1బీ వీసా ఫీజుపై ఊరట.. వీసా సవరణలు, ఎక్స్టెన్షన్కు లక్ష డాలర్ల ఫీజు పెంపు నుంచి మినహాయింపు
  • స్టూడెంట్​ వీసానుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1బీకి మారినా వర్తించదు
  •     యూఎస్ ​సీఐఎస్ కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్​
  •     ఈ ఏడాది సెప్టెంబర్​ 21 తర్వాత 
  • అప్లై చేసుకున్నోళ్లకే పెంపు వర్తింపు
  •     వీసాదారుల విదేశీ ప్రయాణాలు, దేశంలోకి ఎంట్రీపై ఎలాంటి ఆంక్షల్లేవు
  •     విదేశీ విద్యార్థులకు భారీ ప్రయోజనం

న్యూయార్క్: హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1బీ వీసాల రుసుమును లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, ఇతర దేశాల స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ ఊరట కల్పించింది. స్టూడెంట్​ వీసా నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1బీ వీసాలకు మారితే (స్టేటస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్పు) లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపింది. 

ఈ మేరకు యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్​సర్వీసెస్​ (యూఎస్​సీఐఎస్) కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 బీ వీసా కలిగి ఉన్నోళ్లకు.. సవరణలు, ఎక్స్​టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నది. అలాగే, సెప్టెంబర్​ 21 ఉదయం 12.01 గంటలకు ముందు వచ్చిన హెచ్ 1 బీ అప్లికేషన్లకు పెంపు వర్తించదని తెలిపింది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 బీ హోల్డర్ల​ విదేశీ పర్యటనలు, దేశంలోకి రీఎంట్రీపై ఎలాంటి ఆంక్షలు విధించదని పేర్కొన్నది. 

దేశం బయట నుంచి వచ్చే అప్లికేషన్లకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐఎస్ ఒక వ్యక్తి స్టేటస్ మార్పు, సవరణ లేదా విస్తరణకు అనర్హుడని నిర్ధారిస్తే, లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిందేనని తెలిపింది.ఇక, విదేశాల్లోని ఉద్యోగుల కోసం హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీకి అప్లై చేసుకొనే సంస్థలు కూడా ఈ మినహాయింపులను అభ్యర్థించే అవకాశం కల్పించింది. 

ఆ ఉద్యోగికి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ వీసా పొందేందుకు కలిగి ఉన్న అర్హతలను ఆ సంస్థలు వివరించాల్సి ఉంటుంది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ వీసాకు అప్లై చేసుకునేటప్పుడే ఈ మినహాయింపు అభ్యర్థనలు కూడా చేయాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది. అయితే, ఇది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఆమోదం పొందనున్నది.

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1బీ వీసా కావాలంటే అక్కడ చదవాల్సిందే

యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్​ ప్రకారం.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1బీ వీసా దరఖాస్తు చేసుకునే ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కంపెనీలు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. బయట దేశాల నుంచి వచ్చే వారికి కంపెనీలు వీసా స్పాన్సర్ చేయాలనుకుంటే.. ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.. అంటే అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే.. ముందుగా అక్కడ కొన్నేండ్లు తప్పనిసరిగా చదువుకోవాల్సి ఉంటుంది. 

]ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 (స్టూడెంట్) వీసా నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 బీకి మారినా.. లేదా అమెరికాలో ఇంకా ఉండేందుకు వీసా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరినా  లక్ష డాలర్ల ఫీజు కట్టక్కర్లేదు. సెప్టెంబర్ 21న హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1బీ వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు పెంచిన ఫీజును కట్టాల్సి ఉంటుంది.  కాగా, వీసా పెంపు ఫీజు చెల్లింపుల కోసం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలు ప్రారంభించినట్లు యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపింది.