వివాదంగా మారిన గుడిసెల తొలగింపు

వివాదంగా మారిన గుడిసెల తొలగింపు

హన్మకొండ  గోపాలపురంలో  చెరువు దగ్గర  పేదల గుడిసెల తొలగింపు వివాదంగా మారింది.  తమకు ఇంటి స్థలాలు  కేటాయించాలంటూ  గతంలో సీపీఎం  ఆధ్వర్యంలో  చెరువు దగ్గర  పేదలు గుడిసెలు  వేసుకున్నారు. దీంతో మున్సిపల్,  రెవెన్యూ అధికారులు  భారీ పోలీసు  బందోబస్తు మధ్య  గుడిసెలను  తొలగించారు. అడ్డుకునేందుకు  ప్రయత్నించిన  మహిళలను అరెస్ట్  చేసి   కేయూ పోలీస్ స్టేషన్ కు  తరలించారు పోలీసులు. గతంలో తమకు ఇళ్ల  స్థలాలు ఇవ్వాలని  రెవెన్యూ అధికారులను  కోరామన్నారు స్థానికులు.  ఇళ్ల స్థలాలు  ఇవ్వలేమని అధికారులు  చెప్పడంతో గుడిసెలు వేసుకున్నామన్నారు.  అయితే  అధికారులు  తమ గుడిసెలను  క్రేన్ లతో తొలగించి,  నిప్పంటించారని  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన  హామీలను  నెరవేర్చకపోవడంతోనే  గుడిసెలు  వేశామంటున్నారు బాధితులు.  ఇచ్చిన హామీ  ప్రకారం తమకు  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు  కట్టిచ్చి ఇస్తే ...గుడిసెలు వేసుకునే  పరిస్థితి వచ్చేది  కాదంటూ ఆందోళన చేపట్టారు. 

మరిన్ని వార్తల కోసం
కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం