త్వరలోనే ఎలక్ట్రిక్​ కారును తెస్తం : సీఈఓ వెంకట్​రామ్​

త్వరలోనే ఎలక్ట్రిక్​ కారును తెస్తం : సీఈఓ వెంకట్​రామ్​
  •     రెనాల్ట్​ సీఈఓ వెంకట్​రామ్

హైదరాబాద్​, వెలుగు :  తమ కంపెనీ రాబోయే మూడేళ్లలో ఐదు కార్లను ఇండియా మార్కెట్​కు తీసుకువస్తుందని, వీటిలో ఒక ఎలక్ట్రిక్​ కారు కూడా ఉంటుందని ఫ్రెంచ్​ ఆటోమేకర్​ రెనాల్ట్​ ఇండియా సీఈఓ, ఎండీ మామిళ్లపల్లి వెంకట్​రామ్​ వెల్లడించారు. దీని ధర రూ.12 లక్షలలోపు ఉండొచ్చని అన్నారు. హైదరాబాద్​లో మంగళవారం క్విడ్, ట్రైబర్​, డస్టర్​ 2024 మోడళ్లను లాంచ్​ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  

భారతదేశం సహా యూరప్ వెలుపల ఉన్న ఐదు కీలక అంతర్జాతీయ కేంద్రాల కోసం మూడు బిలియన్​ డాలర్లను ఇన్వెస్ట్​ చేస్తామని చెప్పారు.  2023 క్యాలెండర్​ సంవత్సరంలో 49 వేల యూనిట్లు అమ్మామని, ఈ సంవత్సరంలో వీటి సంఖ్య 20 శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇండియాలో తమకు 1.8 శాతం మార్కెట్​ వాటా ఉందని వెంకట్​రామ్​ వివరించారు.