మహబూబ్‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ పునరుద్ధరణ

మహబూబ్‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ పునరుద్ధరణ


హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీ పర్మిషన్‌‌‌‌ను పునరుద్ధరిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యాకల్టీ కొరత, బయోమెట్రిక్ అటెండెన్స్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ లేకపోవడం, సీసీ కెమెరాలు ఇన్‌‌‌‌స్టాల్ చేయకపోవడం వంటి కారణాల వల్ల కాలేజీ పర్మిషన్‌‌‌‌ను రద్దు చేస్తూ ఎన్‌‌‌‌ఎంసీ గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొన్ని సమస్యలను మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ పరిష్కరించింది. మిగిలిన విషయాల్లోనూ చర్యలు తీసుకుంటామని.. పర్మిషన్ పునరుద్ధరించాలని కోరుతూ ఎన్‌‌‌‌ఎంసీకి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన ఎన్‌‌‌‌ఎంసీ కొన్ని షరతులతో పర్మిషన్‌‌‌‌ పునరుద్ధరించింది. ఈ అకాడమిక్ ఇయర్ చివరిలో మరోసారి కాలేజీలో తనిఖీలు చేస్తామని, పర్మిషన్ కోసం కాలేజీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.