సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ..4,092 ఉద్యోగుల సేవల పునరుద్ధరణ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ..4,092 ఉద్యోగుల సేవల పునరుద్ధరణ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్‌‌, వెలుగు: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల కింద పనిచేస్తున్న 4,092 మంది సేవలను పునరుద్ధరించినట్లు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్‌‌ పద్ధతిలో ఇద్దరు, ఔట్ సోర్సింగ్‌‌ పద్ధతిలో 1,545, పార్ట్‌‌ టైమ్‌‌ విధానంలో 2,102, హానరోరియం పద్ధతిలో 443 మొత్తం 4,092 మంది ఉద్యోగుల సేవలు పునరుద్ధరించామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

 ఈ పునరుద్ధరణ ఉత్తర్వులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా కంటిన్యూషన్‌‌ ఆర్డర్లు లేకపోవడంతో వేతనాల చెల్లింపులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి, అనేక కుటుంబాలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు.