సినీ ఇండస్ట్రీలో మరో మరణం

సినీ ఇండస్ట్రీలో మరో మరణం

మలయాళ సీనియర్ నటి, రంగస్థల నటి కేపీఏసీ లలిత (74) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. లలిత దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో మలయాళం, తమిళంలో కలిపి 550కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు ఉత్తమ సహాయ నటిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. లలిత నటించిన ‘అమరమ్‌’ సినిమాకు గాను  1999లో, 2000లో ‘శాంతం’ సినిమాలోని పాత్రకు జాతీయ అవార్డు వచ్చింది.

లలిత కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. అలప్పుజాలోని కాయంకులంలో లలిత జన్మించింది. ఆమె తొలి పేరు మహేశ్వరి అమ్మ. కేరళలోని ప్రముఖ నాటక బృందం  KPAC (కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్)లో చేరిన తర్వాత లలిత అని పేరు మార్చుకున్నారు. ఆమె మలయాళ చిత్రనిర్మాత, దివంగత భరతన్‌ను వివాహం చేసుకుంది. లలిత.. మలయాళ చిత్రనిర్మాత, నటుడు  సిద్ధార్థ్‎కు తల్లి.

లలిత మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంతాపం తెలిపారు. లలిత తన నటనతో అన్ని తరాలవారికి గుర్తుండిపోయారని ఆయన అన్నారు. కేరళ లలిత సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా ఆమె చేసిన సేవలను విజయన్ గుర్తుచేసుకున్నారు.

For More News..

స్థానికులనే శరణార్థులుగా మార్చారు