సిటీలో 3 ఏరియాల్లో రెంటెడ్ సైకిల్ స్టేషన్లు

సిటీలో 3 ఏరియాల్లో రెంటెడ్ సైకిల్ స్టేషన్లు
  • గతంతో పోలిస్తే 60 నుంచి  70 శాతం పెరిగిన సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌లు

హైదరాబాద్, వెలుగు:  సైక్లింగ్ అలవాటు సిటిజన్లలో రోజురోజుకూ పెరుగుతోంది. హెల్దీగా, ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండేందుకు ఎక్కువమంది సైకిల్​పై వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోజువారీ అవసరాల కోసం టూ వీలర్స్‌‌‌‌‌‌‌‌ బదులుగా సైకిళ్లనే వాడటం షురూ చేశారు. సిటీలో ‘రెంట్ ఏ బైస్కిల్’ కూడా అందుబాటులో ఉంది. ఇవి కొన్నేళ్ల క్రితం ఏర్పాటైనప్పటికీ వీటికి ఈ మధ్యకాలంలో ఆదరణ డబులైంది. సిటీలోని 3 ప్రాంతాల్లో రెంటెడ్ సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ వందల సైకిళ్లు అందుబాటులో ఉండగా.. సైక్లింగ్‌‌‌‌‌‌‌‌పై ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ అవసరాలకు అనుగుణంగా  గంట నుంచి ఒక నెల వరకు వీటిని రెంట్​కు తీసుకుని వాడుతున్నారు.

గ్రేటర్​లో 10 వేల మంది సైక్లిస్టులు

గ్రేటర్​లో దాదాపు 10 వేల మంది సైక్లిస్టులున్నారు. వీరిలో ముగ్గురు నుంచి నలుగురు  వివిధ అవసరాలపై ప్రతిరోజు సైకిల్‌‌‌‌‌‌‌‌ను వాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య  పెరుగుతోంది.  స్టూడెంట్లతో పాటు ఉద్యోగులు కూడా వర్క్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లకు బైక్ లపై కాకుండా సైకిల్ ను వాడుతున్నారు. ఈ క్లబ్స్ ఆధ్వర్యంలో వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో రైడ్స్ కూడా నిర్వహిస్తుంటారు.  సిటీలోని గచ్చిబౌలి, నెక్లెస్‌‌‌‌‌‌‌‌
రోడ్, సుచిత్రా సర్కిల్‌‌‌‌‌‌‌‌లో సైకిల్ స్టేషన్లు ఉన్నాయి.  సైకిల్​ను రెంట్​​కు తీసుకోవాలనుకునే వారు తమ ఐడీ ప్రూఫ్‌‌‌‌‌‌‌‌ను ఇవ్వాల్సి ఉంటుంది. గంటకు రూ. 30 నుంచి  24 గంటలకు రూ. 100, వారానికి రూ. 300 , 15 రోజులకి రూ. 450, నెలకి రూ. 900తో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వీక్లీ ప్యాకేజీకి ఎక్కువగా రెస్పాన్స్ ఉంటోందని నిర్వాహకులు చెప్తున్నారు. వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో రెంట్​కు తీసుకునేవారు అధికంగా ఉన్నారని చెప్తున్నారు.

సగానికి పైగా పెరిగారు..

2019లో సుచిత్రా సర్కిల్‌‌‌‌‌‌‌‌లో వంద సైకిళ్లతో సైకిల్ స్టేషన్ స్టార్ట్ చేశాం. ఒకప్పటితో పోలిస్తే దాదాపు 60 నుంచి 70 శాతం మంది సైక్లింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్లు ఉంటున్నారు. ఆఫీసులకు, ఇతర పనులకు వీటి మీద వెళ్లేవాళ్లు ఉన్నారు. నాలుగైదు సార్లు రెంట్‌‌‌‌‌‌‌‌కి తీసుకుని తర్వాత సొంతంగా కొనుక్కుంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. 

- రవీందర్ నందనూరి, ఫౌండర్, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్

సైక్లింగ్ చాలెంజ్​లు పూర్తి చేశా..

సైకిల్ స్టేషన్​ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లా. వారం పాటు సైకిల్​ రెంట్​కు తీసుకున్నా. సైక్లింగ్​పై ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కూడా సైక్లిస్ట్ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యా. 24 గంటలు, 100 కి.మీల సైక్లింగ్ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌లు కూడా పూర్తి చేశా. ఇప్పటికీ వీక్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌లో, వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో సైకిల్ రెంట్​కు తీసుకుంటున్నా. 

-  వీణ, సైక్లిస్టు, కొంపల్లి