ఖమ్మం జిల్లా కారేపల్లి బాధితులను పరామర్శించిన రేణుక చౌదరి

ఖమ్మం జిల్లా కారేపల్లి బాధితులను పరామర్శించిన రేణుక చౌదరి

ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన గ్యాస్ సంఘటన బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే అధికార మదంతో అక్రమ కేసులు బనయించడం దారుణమని ఆరోపించారు. నిన్న చనిపోయిన సందీప్ ని హుటాహుటిన హాస్పిటల్ నుంచి తరలించి దహన సంస్కారాలు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్న ఆమె.. బాధిత కుటుంబాలను ఎక్స్ గ్రేషియోతో పాటు వారి పిల్లలకు చదువును ఉచితంగా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ ఘటనను తప్పుదోవ పట్టించి అబద్ధాలు ఆడుతున్నారని రేణుక చౌదరి అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళితే 144 సెన్షన్ తో పాటు ఎక్కడా లేని చట్టాలు గుర్తుకు  వస్తున్నాయంటూ ఆమె మండిపడ్డారు. 

ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన కొద్దీ దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.  దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయల  ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.  ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వ్యక్తిగతంగా  రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.