సొంతగడ్డపై జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది. అధికారికంగా ప్రకటించకపోయినా ఈఎస్పియన్ క్రిక్ ఇన్ఫో వెల్లడించడంతో ఇండియా షెడ్యూల్ ఖరారైంది. తొలిసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు ఆడుతుండడంతో ఆసక్తి నెలకొంది. ఐదు జట్లు నాలుగు గ్రూప్ లుగా విభజించబడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్ కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లో మొత్తం 8 జట్లు నాలుగు జట్లతో రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. నాలుగు జట్లలో టాప్-2 లో ఉన్న జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.
టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తల పరిస్థితుల కారణంగా ఇండియా, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండవనే వార్తలు వచ్చాయి. అయితే దాయాధి జట్లు ఒకే గ్రూప్ లో ఉంచినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ తో పాటు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ కూడా ఒకే గ్రూప్ లో సెట్ చేసినట్టు సమాచారం. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడతాయి. పాకిస్థాన్ తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకలోని ఆడనుంది.
టీమిండియా షెడ్యూల్ విషయానికి వస్తే ఫిబ్రవరి 7న ప్రారంభ మ్యాచ్ లో యూఎస్ఏ తో తలపడుతుంది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 12 న నమీబియాతో ఢిల్లీ వేదికగా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఫిబ్రవరి 15న కొలంబోలో.. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. సూపర్-8కు అర్హత సాధిస్తే వరుసగా మూడు మ్యాచ్ లు అహ్మదాబాద్, చెన్నై, కోల్ కతా వేదికలుగా జరుగుతాయి. భారత జట్టు సెమీ ఫైనల్ కు వస్తే ముంబైలో.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో ఆడనుంది.
ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ నేడు (నవంబర్ 25) ఐసీసీ రివీల్ చేయనుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ముంబైలో పూర్తి మ్యాచ్ లు, వేదికల వివరాలను వెల్లడించనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ఏంజిలో మాథ్యూస్.. భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో ఐసీసీ షెడ్యూల్ రివీల్ చేయనుంది. 2024 టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలుచుకోవడంతో సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత జట్టు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతుంది.
టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే:
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, యూఎస్‌ఏ, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, ఒమన్, నేపాల్, యూఏఈ
🚨 India's 2026 T20 World Cup Fixtures 🚨
— CricketGully (@thecricketgully) November 25, 2025
[ESPNCricinfo]
🔹 7th Feb - IND vs USA @ Mumbai
🔹 12th Feb - IND vs NAM @ Delhi
🔹 15th Feb - IND vs PAK @ Colombo
🔹 18th Feb - IND vs NED @ Ahmedabad
(If Qualifies)
🔹 Super 8 Game @ Ahmedabad
🔹 Super 8 Game @ Chennai
🔹 Super 8 Game… pic.twitter.com/FIgj6SJ84Y
