మినీ ఐపీఎల్ అంటే ఆమాత్రం ఉండాలే: అంబరాన్ని అంటేలా ప్రారంభోత్సవ వేడుకలు

మినీ ఐపీఎల్ అంటే ఆమాత్రం ఉండాలే: అంబరాన్ని అంటేలా ప్రారంభోత్సవ వేడుకలు

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. అమెరికా వాళ్లు తలుచుకుంటే ఆడంబరాలకు కొదవా చెప్పండి. అందుకే అగ్రరాజ్యం అమెరికా నడిబొడ్డున జరగనున్న క్రికెట్ సంగ్రామాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

జూలై 13 నుంచి డల్లాస్ వేదికగా మేజర్ లీగ్ క్రికెట్(మినీ ఐపీఎల్) టోర్నీ ప్రారంభం కానుంది. తొలిసారి ఈ టోర్నీ నిర్వహిస్తుండంతో నిర్వాహకులు.. ప్రారంభోత్సవ వేడుకలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. బాణసంచా, డ్రోన్ ప్రదర్శనలకు తోడు వైమానిక విన్యాసాలతో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. మ్యాచ్ ముగిశాక బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొల్పునున్నాయి. 

ఈ టోర్నీ గురుంచి మేజర్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా మాట్లాడుతూ.. "అమెరికా తొలిసారి ఆతిథ్యమిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ అభిమానులకు మరపురాని అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. డ్రోన్ షో, బాణసంచా వెలుగులు, ఏరోబాటిక్ ఏరియల్ డిస్‌ప్లే.. ప్రేక్షకులతో పాటు  ఆటగాళ్లను మైమపరిస్తాయని చెప్పుకొచ్చాడు.

ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జూలై 13న టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పలువురు విదేశీ ఆటగాళ్లు కనిపించనున్నారు. మిస్టరీ టీ 0 స్పిన్నర్ రషీద్ ఖాన్, ఫాఫ్ డు ప్లెసిస్, డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్, సికందర్ రజా, వనిందు హసరంగా, అంబటి రాయుడు, ట్రెంట్ బౌల్ట్ వంటి పలువురు అంతర్జాతీయ స్టార్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు.