సీఎం కేసీఆర్ తో రామచంద్ర మిషన్ ప్రతినిధుల భేటీ

సీఎం కేసీఆర్ తో రామచంద్ర మిషన్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తాము హైదరాబాద్ లో త్వరలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా మిషన్ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్.. సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. రామచంద్ర మిషన్ ప్రతినిధులు గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.