
మేడ్చల్ జిల్లాలో చెరువులో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం డీఆర్ఎఫ్ టీం గాలింపు చేపట్టింది. సంఘటనా స్థలానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం NDRF టీంతో, మృతుల కుటుంబాలతో మాట్లాడారు. రాచకొండ DRF డిజరేటర్ రెస్క్యూ ఫోర్స్ టీంతో కలిసి చెరువులో పడి చనిపోయిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. కీసర పరిధిలోని చిర్యాల్ లో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు... చెరువులో పడి మృతి చెందారు.
మృతి చెందిన వాళ్లల్లో ఇద్దరి విద్యార్థుల పుట్టినరోజులు ఒకే రోజు కాగా... అదే రోజు చనిపోవడం అందర్నీ కలచివేస్తోంది. వీరంతా తీగల కృష్ణారెడ్డి కళాశాలకు చెందిన హరహరన్, ఉబేద్, బాలాజీగా పోలీసులు గుర్తించారు. మొత్తం 9 మంది విద్యార్థులు కలిసి చిర్యాల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం చెరువుకు వెళ్లారు. ఈత కొడుతుండగా ముగ్గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే.. హరిహరన్, ఉబేద్, బాలాజీ నీటిలో మునిగి విగతజీవులుగా మారారు.