
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ వరంగల్ ) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 24.
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, సోషియాలజీ, జెండర్ స్టడీస్, ఎడ్యుకేషన్ విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nitw.ac.in
వెబ్సైట్లో సంప్రదించగలరు.