ఓయూలో  హాస్టళ్లను తెరవాలి

ఓయూలో  హాస్టళ్లను తెరవాలి
  • వర్సిటీలోని చీఫ్ వార్డెన్ ఆఫీసు ఎదుట రీసెర్చ్ స్కాలర్ల ఆందోళన

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలో హాస్టళ్లు, మెస్ ను తెరవాలని  డిమాండ్ చేస్తూ గురువారం వర్సిటీలోని చీఫ్ వార్డెన్ ఆఫీసు ముందు రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. పరిశోధక స్టూడెంట్లకు ఏడాది మొత్తం  అందుబాటులో ఉండాల్సిన మెస్ ను రెండేళ్లుగా కరోనా సాకుతో మూసివేస్తున్నారన్నారు.  రాష్ట్రంలో ఎన్నో విద్యాసంస్థలల్లో హాస్టళ్లు తెరుచుకున్నా.. రీసెర్చ్ స్కాలర్స్​ కు మాత్రం ఓపెన్ చేయడం లేదన్నారు.   సోమవారం లోగా మెస్ ఓపెన్ చేయకపోతే  హాస్టల్ ముందు టెంట్ వేసి నిరసన చేపడతామన్నారు.