రిజర్వేషన్లు 50 శాతం మించి చెల్లవు

రిజర్వేషన్లు 50 శాతం మించి చెల్లవు

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేత

అమరావతి, వెలుగు: ఎన్నికల్లో ప్రభుత్వాలు అమలు చేసే రిజర్వేషన్లు 50 శాతం మించరాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో 50 శాతానికి మించిన రిజర్వేషన్ల అమలు చెల్లదని తీర్పు చెప్పింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోట్టివేసింది. 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ 4 వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్ల అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో సోమవారం తుది విచారణ జరిగింది. పిటిషనర్​తరుఫు లాయర్ వాదిస్తూ.. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తోందని తెలిపారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లను స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీల రిజర్వేషన్ల శాతం పెంచిందని ఆరోపించారు. రిజర్వేషన్ల పెంపుపై అడ్వకేట్ జనరల్ దాఖలు చేసిన కౌంటర్​ పిటిషన్​ను పరిశీలిచిన బెంచ్ తీర్పు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్‌‌ కల్పించే నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులను కోట్టి వేస్తున్నట్లు ప్రకటించింది.

For More News..

చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!