
హైదరాబాద్ : సెక్రటేరియట్ కూల్చివేతపై అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో… మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిర్వహణలో.. హైదరాబాద్ లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు అఖిలపక్ష నేతలు.
- సెక్రటేరియట్ భవనాలను…. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చొద్దు.
- సెక్రెటేరియట్, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలి. కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయొద్దు
- చారిత్రక – వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఉనికిని కాపాడాలి.
- పై డిమాండ్ల సాధనకు గవర్నర్ ను కలిసి మెమోరాండం ఇవ్వాలి. జిల్లాల్లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాలను జరపాలి. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలి. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్షం ప్రకటించింది.
- అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.
- కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.
పై తీర్మానాలను ప్రజాస్వామిక తెలంగాణ వేదికగా నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ ఏకగ్రీవంగా ఆమోదించింది.