పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
  •  సీఎస్​ను కలిసిన టీజీవో నేతలు

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లోఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎస్ శాంతికుమారిని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) అసోసియేషన్ నేతలు కోరారు. బుధవారం సెక్రటేరియట్ లో సీఎస్ ను టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్యామ్ తో పాటు పలువురు నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎలక్షన్ డ్యూటీ చేసిన ఆఫీసర్లకు అందించే రెమ్యునరేషన్లలో వ్యత్యాసాలను తొలగించాలన్నారు.

సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను కొనసాగించాలని కోరారు. ఉద్యోగులు కాంట్రిబ్యూట్ చేస్తున్న డబ్బుతో ఎంప్లాయ్​ హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను రిలీజ్ చేయాలని పేర్కొన్నారు. ఈ నెలలో రిటైర్ అవుతున్న ఉద్యోగుల ప్లేస్ లో మిగతా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని నేతలు కోరారు. ఏపీలో పనిచేస్తున్న 144 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకురావాలని వివరించారు.

కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ర్టెంత్ ఖరారు చేయాలని, ఐఆర్ ను 5 నుంచి 20 శాతానికి పెంచాలని, రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులకు 24 శాతం హెచ్ ఆర్ ఏ చెల్లించాలని నేతలు కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారని నేతలు స్పష్టం చేశారు.