నీలి రొయ్య.. 20 లక్షల్లో ఒకటి మాత్రమే!

నీలి రొయ్య.. 20 లక్షల్లో ఒకటి మాత్రమే!

ఇది రొయ్యే! స్పెషల్​ రొయ్య! నీలి రొయ్య! 20 లక్షల్లో ఒకటి మాత్రమే నీలం రంగులో ఉండే రొయ్య ఇది. అమెరికాలోని మసాచుసెట్స్​ రాష్ట్రంలో ఉన్న ఈస్ట్​హాం ప్రాంతానికి చెందిన ఓ రెస్టారెంట్​ ఓనర్​కు షిప్​మెంట్​లో వచ్చిందీ నీలి రొయ్య. ఆర్నాల్డ్​ లాబ్​స్టర్​ అండ్​ క్లామ్​ బార్​ ఓనర్​ నాథన్​ నికర్​సన్​.. రొయ్యలు ఆర్డర్​ ఇచ్చాడు. ఆ ఆర్డర్​లో ఇలా నీలి రొయ్య వచ్చింది. దానిని వండకుండా ఓ వారం పాటు ప్రదర్శనకు పెడతానని నికర్సన్​ చెప్పాడు. ఆ తర్వాత సెయింట్​ లూయిస్​లో త్వరలో ప్రారంభం కాబోతున్న ఓ ఆక్వేరియంకు దానం చేసేస్తానని చెప్పాడు. కాగా, ఇలాంటి రొయ్యలు ప్రతి 20 లక్షల్లో ఒకటి మాత్రమే ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్​ మెరీన్స్​ లాబ్​స్టర్​ ఇనిస్టిట్యూట్​ సైంటిస్టులు చెప్పారు.