Food : రెస్టారెంట్లలో ఫుడ్ ఐటమ్స్ ఫొటో తీస్తున్నారా..?

Food : రెస్టారెంట్లలో ఫుడ్ ఐటమ్స్ ఫొటో తీస్తున్నారా..?

రెస్టారెంటికి వెళ్లినా, ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసుకున్నా.. వెంటనే ఫొటో తీసి సోషల్మీడియా లో పోస్ట్ చేస్తారు చాలామంది. ఫొటో తియ్యంది, సోషల్ మీడియాలో పెట్టంది కనీసం ముట్టుకోరు కూడా. అయితే, అ చేయడం వల్ల లావు పెరుగుతరట. ఫొటోతీస్తే లావు ఎట్ల పెరుగుతరు?' అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే.

ఏదైనా తినేముందు వందలో 70 మంది కచ్చితంగా ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు సర్వేల్లో తేలింది. అయితే, అలా చేయడం వల్ల క్రేవింగ్స్ పెరుగుతాయట. మామూలు దానికంటే ఎక్కువగా తింటారట. యూఎస్ లోని జార్జియా సదరన్ యూనివర్సిటీ చేసిన సర్వే ఈ విషయాలు చెబుతోంది. తినేముందు ఫొటో తీసే వాళ్లలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉండి.. ఇంకా ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుందని ఆ రీసెర్చ్ లో తేలింది.

ALSO READ : Health Tip : మసాజ్కు ఫుల్ డిమాండ్

అంతేకాకుండా రెండోసారి తినాలనిపిస్తుందట. ఫొటో తీసుకోవడం వల్ల ఆ ఐటమ్ పై తెలియకుండానే ఇష్టం పెరిగిపోయి.. మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుందనేది సారాంశం. జార్జియా సదరన్ యూనివర్సిటీ 145 మంది స్టూడెంట్స్ పై ఈ రీసెర్చ్ చేసింది. స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా విభజించి ఒక్కోక్కరికి ఒక్కో ప్లేట్ ఛీజ్ క్రాకర్స్ ఇచ్చారు. 

వాళ్లలో ఒక గ్రూప్ ను వెంటనే తినమని చెప్పి, ఇంకో గ్రూప్ ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక తినమని చెప్పారు. తిన్నతర్వాత ఫుడ్ కి రేటింగ్ ఇవ్వమని అడిగితే. ఫొటోలు తీసిన వాళ్లు... ఫుడ్ ని చాలాబాగా ఎంజాయ్ చేశామని, మళ్లీ కావాలని అడిగారని రీసెర్చ్ గ్రూప్ చెప్పింది. 

అందుకే, ఎవరైనా ఎక్కువగా తినకుండా ఉండాలన్నా.. జంక్ ఫుడ్ మానేయాలన్నా ఫొటోలు తీసుకోకపోవడం బెటర్ అని చెప్పింది. ఫొటోలు తియడం అంటే స్వీట్ మెమొరీగా ఉంచుకోవడం కాబట్టి. దాన్ని బ్రెయిన్ మళ్ళీ మళ్లీ కోరుకుంటుందని చెప్పారు రీసెర్చర్లు.