V6 News

జనగామ కలెక్టరేట్లోకి ఎంట్రీకి ఆంక్షలు

జనగామ కలెక్టరేట్లోకి ఎంట్రీకి ఆంక్షలు

జనగామ, వెలుగు : జనగామ కలెక్టరేట్​లోకి ఎంట్రీకి ఆంక్షలు విధించారు. ఈ నెల 17 తేదీతో జారీ చేసిన ఆర్​సీ నెంబర్ జీఏ, సెక్యూరిటీ/2026/ 397ను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చారు. దీంతో కలెక్టరేట్​కు వచ్చే ప్రతి ఒక్కరూ గేటు వద్దే ఉన్న రిజిస్టర్​లో పేరు, తండ్రి పేరు, ఊరు, ఏ డిపార్ట్​మెంట్​కు వెళ్తున్నారో పేర్కొనడంతో పాటు ఎంట్రీ టైం కూడా రాసి సంతకం చేసి, ఆ తర్వాతే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. 

లోనికి వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అవుట్​ టైంను రిజిస్టర్​లో పేర్కొంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 180 మందికి పైగా రిజిస్టర్​లో సంతకాలు చేసి కలెక్టరేట్​లోనికి వెళ్లారు. డిపార్ట్​మెంట్ హెచ్​వోడీలతో పాటు స్టాఫ్​కు సంబంధించిన వెహికల్స్​కు వేర్వేరు రంగుల్లో ఏడాది వ్యాలిడిటీ ఉన్న స్టిక్కర్లు జారీ చేశారు. ఈ స్టిక్కర్​ ఉన్న వెహికల్​నే గేటు వద్ద ఉన్న గార్డ్​ లోనికి అనుమతిస్తారు. అంబులెన్స్, ఫైర్, పోలీసు వెహికల్స్ వచ్చినా గార్డ్​ వెరిఫికేషన్​ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.