జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్

ఓమిక్రాన్ నేపథ్యంలో తాత్కాలిక ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వుల ఆదేశాలతోనే  ఆంక్షలు విధించిన  సర్కార్.. జనాలు ఎక్కువ ఉన్నచోట్ల థర్మల్ స్కానింగ్, మాస్క్ తప్పనిసరి చేసింది. భౌతికదూరం కూడా తప్పనిసరిగా పాటించాలన్న ప్రభుత్వం .. ఈ క్రమంలోనే జనవరి 2వ తేదీ, 2022 వరకు రూల్స్ వర్తించనున్నట్లు తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధమని చెప్పింది.  ఓమిక్రాన్ పెరుగుతున్న క్రమంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోగా..మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తప్పవని తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.