కంపెనీలను ఆకట్టుకుంటున్న చాట్ జీపీటీ 'రెజ్యూమ్'

కంపెనీలను ఆకట్టుకుంటున్న చాట్ జీపీటీ 'రెజ్యూమ్'

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ అద్భుతం చాట్​బాట్​ చాట్​ జీపీటీపై రోజూ ఏదో ఒక వార్త నెట్టింట వైరల్​గా మారుతోంది. ప్రారంభించిన నాటి నుంచి ప్రజలు దీనితో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు తగినట్టే ఊహించని ఫలితాలు పొందుతున్నారు. ఒక వ్యక్తి తాను చాట్​ జీపీటీ సాయంతో రెజ్యూమ్​ని రూపొందించానని, అది విజయవంతమైందని తెలిపాడు. ఆ రెజ్యూమ్​తో జాబ్​ ఆఫర్లూ వెల్లువెత్తుతున్నాయని హర్షం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని సోషల్​ మీడియాలో పంచుకున్నాడు.

ప్రశ్నలు వేసి.. సమాధానం రాబట్టి

ఆ వ్యక్తి చాట్​ జీపీటీతో తనకు కలిగిన అనుభవాలు పంచుకున్నాడు. "నేను నా రెజ్యూమ్​ చేయమని చాట్​ జీపీటీని అడిగాను. అది నా అనుభవం ఎంత, ఏయే రంగాల్లో అవగాహన ఉంది, ఇంతకు ముందు ఎక్కడ పని చేశారు, ఏ రంగంలో ఉండాలనుకుంటున్నారు, ఎంత జీతం కావాలనుకుంటున్నారు తదితర కోణాల్లో ప్రశ్నలు వేసింది. వీటన్నింటికీ సమాధానం ఇచ్చిన వెంటనే, అది అద్భుతమైన రెజ్యూమ్​ని రూపొందించింది. దానిని కంపెనీలకు పంపగానే నాకు మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కంపెనీలు కూడా రెజ్యూమ్​ చూసి నాపై ప్రశంసలు కురిపించాయి." అని ఆయన తెలిపారు. తాను ప్రస్తుతం ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. అతను ఈ విషయాన్ని కొన్ని గంటల క్రితం సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయగా ఇప్పటి వరకు దానిని దాదాపు 4000 మంది లైక్​ చేశారు.  మిగతా నెటిజన్స్​కూడా చాట్​జీపీటీతో తమకు కలిగిన అనుభవాలను పంచుకుంటున్నారు.