ఎల్​ అండ్ ​టీ నుంచి కంప్లీట్​ హోమ్‌‌ లోన్​

ఎల్​ అండ్ ​టీ నుంచి  కంప్లీట్​ హోమ్‌‌ లోన్​

హైదరాబాద్, వెలుగు :  రిటైల్ ఫైనాన్షియర్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టీ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌‌‌‌‌‌‌‌టీఎఫ్),  ‘ది కంప్లీట్ హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్’ని ప్రారంభించింది.  పూర్తి డిజిటలైజ్డ్ ప్రాసెస్ ద్వారా డెడికేటెడ్ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ సాయంతో లోన్​ను త్వరగా అందించడానికే ఈ విధానాన్ని తెచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి హోం డెకర్​ లోన్​ను కూడా ఇస్తామని ప్రకటించింది. 

 ఈ సందర్భంగా ఎల్‌‌‌‌‌‌‌‌టీఎఫ్‌‌‌‌‌‌‌‌ అర్బన్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గార్యాలీ మాట్లాడుతూ, “హైదరాబాద్ మాకు కీలకమైన మార్కెట్,  'ది కంప్లీట్ హోమ్  లోన్' ప్రారంభించడంలో మేం ప్రధానంగా హోం లోన్లను కోరుకునే కొత్త కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నాం. మా వడ్డీ రేట్లు 8.6 శాతం నుంచి మొదలవుతాయి. మా లోన్​బుక్​ విలువ రూ.85 వేల కోట్ల వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం”అని ఆయన వివరించారు.