4 నెలల గరిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌

4 నెలల గరిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌
  •      డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీపీఐ 5.69 శాతం
  •     ఆహార పదార్ధాల ధరలు పెరగడమే కారణం

న్యూఢిల్లీ :  దేశంలో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  కిందటి నెలలో నాలుగు  నెలల గరిష్టానికి చేరుకుంది. ఆహార పదార్ధాల ధరలు  పెరగడంతో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5.69 శాతాన్ని టచ్ చేసింది. అంతకు ముందు నెలలో ఇది 5.55 శాతంగా, 2022 లోని డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5.72 శాతంగా నమోదయ్యింది . ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌  కిందటి నెలలో 9.53 శాతానికి పెరగగా, అంతకు ముందు ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.19 శాతంగా రికార్డయ్యింది. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.7 శాతంగా ఉంది.  

ఆహార పదార్థాల ధరల్లో అనిశ్చితి వలన రానున్న నెలల్లో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరగొచ్చని  చివరి ఎంపీసీ ప్రకటనలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కొన్ని కీలక కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా సమీప కాలంలో సీపీఐ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  కూడా పెరగొచ్చని ఆయన అన్నారు. రబీ సీజన్‌‌‌‌‌‌‌‌లో గోధుమ, మిర్చి వంటి మసాలాలు, పప్పులు వంటి పంటల దిగుబడిపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని చెప్పారు. 

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా చక్కెర ధరలు పెరగడం కూడా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతోందని గతంలో పేర్కొన్నారు. అయినప్పటికీ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ రాయిటర్స్ వేసిన అంచనా 5.87 శాతం కంటే తక్కువ ఉంది.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అప్పర్ లిమిట్‌‌‌‌‌‌‌‌ 6 శాతం లోపు వరుసగా నాలుగో నెలలోనూ నమోదయ్యింది. 

నెమ్మదించిన ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌

పరిశ్రమల ఉద్పాతకతను కొలిచే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ (ఐఐపీ) కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  2.4 శాతానికి తగ్గింది. 2023 మార్చి తర్వాత ఇదే తక్కువ. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.2 శాతం (ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్ ఇయర్) మాత్రమే  పెరిగింది. క్లాత్స్‌‌‌‌‌‌‌‌, ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌, ఆప్టికల్ ప్రొడక్స్ట్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లలో తయారీ నెమ్మదించింది. ఎలక్ట్రిసిటీ సెక్టార్ నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5.8 శాతం వృద్ధి చెందగా, మైనింగ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ 6.8 శాతం గ్రోత్ నమోదు చేసింది.