
CPI Inflation: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలకు తగ్గుతున్నాయి. 2017 తర్వాత జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.55 శాతంగా రికార్డ్ అయ్యింది. దాదాపు 8 ఏళ్ల కనిష్ఠాలకు రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకుంది. దీంతో వరుసగా 9వ నెల కూడా ద్రవ్యోల్బణం తగ్గటంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
ఇక ఆహార ధరల ద్రవ్యోల్బణం -1.76 శాతంగా నమోదు కాగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం జూలై నెలలో 2.10 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గటానికి ప్రధానంగా పప్పు ధాన్యాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గుడ్లు, చక్కెర, విద్య, రవాణా, కమ్యూనికేషన్ వంటి వాటి రేట్లు తగ్గటమేనని డేటా చెబుతోంది.
►ALSO READ | చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం.. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ లోన్స్ లిమిట్ పెంపునకు ప్లాన్..!
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 1.72 శాతం నుంచి జూలైలో 1.18 శాతానికి తగ్గింది. అలాగే ఇక్కడ ఆహార ద్రవ్యోల్బణం -1.74 శాతంగా ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.05 శాతంగా జూలైలో నమోదుకాగా.. ఆహార ద్రవ్యోల్బణం -1.90 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఇక ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ద్రవ్యోల్బణం జూలై మాసంలో 2.12 శాతంగా ఉంది. ఇక హౌసింగ్ ద్రవ్యోల్బణం 3.17 శాతం, ఎడ్యుకేషన్ ద్రవ్యోల్బణం 4 శాతంతో తగ్గుదలను నమోదు చేశాయి. అయితే హెల్త్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 4.57 శాతంగా ఉన్నాయి. అలాగే ఇంధన ద్రవ్యోల్బణంగా కూడా స్వల్పంగా పెరిగి 2.67 శాతంగా ఉంది.