చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం.. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ లోన్స్ లిమిట్ పెంపునకు ప్లాన్..!

చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం.. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ లోన్స్ లిమిట్ పెంపునకు ప్లాన్..!

అమెరికా ఇటీవల భారతదేశంపై సుంకాలను 50 శాతానికి పెంచటంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ట్రంప్ టారిఫ్స్ ఎక్కువగా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ వ్యాపారాలను దెబ్బ కొట్టనున్నాయి. ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించటంతో పాటు.. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా ఉన్న వీటిని కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది భారత్. 

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ అండ్ మైక్రో వ్యాపార సంస్థలకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా సెంట్రల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద అందిస్తున్న లోన్స్ పరిమితిలిని గతంలో ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దీంతో టారిఫ్స్ ప్రభావాన్ని చిన్న వ్యాపారులు తట్టుకునేందుకు వీలవుతుందని దీనిపై పూర్తి స్థాయి నిర్ణయం నెలాఖరు నాటికి ఫైనల్ అవుతుందని సదరు అధికారులు మనీకంట్రోల్ వార్తా సంస్థకు వెల్లడించారు. 

►ALSO READ | E20 పెట్రోల్ వివాదం: అర్బన్ క్రూజర్ ఓనర్ ప్రశ్నకు టయోటా షాకింగ్ ఆన్సర్!

దీనిపై చర్చిచేందుకు రిజర్వు బ్యాంకుతో ప్రభుత్వ సంప్రదింపులు జరగగా.. దీనికి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదని కేవలం ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుందని తెలిసింది. ఆగస్టు 21 తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. చిన్న పరిశ్రమలకు అందించే రుణాలను క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఆధీనంలో ఉంటాయి. 2010లో ప్రారంభించబడిన ఈ స్కీమ్ ఏదైనా సందర్భంలో సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలమైతే 75-90 శాతం వరకు చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంకులకు రీపే చేస్తుంది. 

చిన్న పరిశ్రమల వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహకాలను అందించే విధంగా యూరప్, యూకే, పెరు, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలకు ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ చర్యలు అమెరికా ఆంక్షలతో నష్టపోతున్న వ్యాపారులకు ఊరటను అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.