
భారతదేశంలో ప్రభుత్వం 20 శాతం ఇథనాల్ మిక్స్ చేసిన ఇంధనాన్ని విక్రయిస్తోంది. గతంలో ఉన్న ప్యూర్ పెట్రోల్ లో ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ మిక్స్ చేయటం ద్వారా దిగుమతులను తగ్గించుకోవటంతో పాటు పొల్యూషన్ తగ్గించవచ్చని రవాణా శాఖ వెల్లడించింది. దీనిపై కొన్ని రోజుల కిందట వాహన యజమానులు ఆందోళన చెందక్కర్లేదని క్లారిటీ కూడా ఇచ్చింది.
అయితే పాత వాహనాల్లో ప్రస్తుతం ఓనర్లు E20 ఫ్యూయల్ వాడితే ఇంజన్లు డ్యామేజ్ అవుతాయనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఒక అర్బన్ క్రూజర్ వాహన యజమాని తన కారులో E20 ఇంధనం వాడటం సేఫేనా అని టయోటా సపోర్ట్ టీమ్ ను అడిగాడు. దీనిపై బదులిచ్చిన సదరు కంపెనీ అలా చేయెుద్దని సూచించింది. ఎందుకంటే క్రూజర్ కారు E10 అంటే కేవలం 10 శాతం ఇథనాల్ మిక్స్ చేసిన ఇంధనంతో నడిచేందుకు మాత్రమే ఇంజన్ డిజైన్ చేయబడటమే. అయితే పూర్తి సమాచారం కోసం ఒకసారి యూజర్ మాన్యువల్ పరిశీలించాలని కారు యజమానికి టయోటా టీం సూచించింది. అయితే తమ జవాబు కేవలం అడిగిన కారు మోడల్ గురించి మాత్రమేనని టయోటా వెల్లడించింది.
దీంతో యూజర్ మాన్యువల్ చూడగా అందులో చాలా స్పష్టంగా వాడాల్సిన ఇంధనం గురించి చెబుతూ E10 మాత్రమే ఉపయోగించాలని కంపెనీ సూచించింది. అయితే E20 పెట్రోల్ లేదా డీజిల్ వాడటం వల్ల కారు ఇంజన్ లేదా ఇతర భాగాలకు ఏర్పడే ఎలాంటి నష్టాలైనా వారెంటీ కింద కవర్ కావని.. తప్పుడు ఇంధనం వాడటం వల్ల ఏర్పడిన రిపేర్లు లేదా నష్టాలకు యజమానే బాధ్యుడని ఓనర్ మాన్యువల్ లో చెప్పబడింది. అంటే E20 ఇంధనం వాడటం వల్ల నష్టాలకు ఎలాంటి వారెంటీ క్లెయిమ్స్ కంపెనీ భరించదు.
ALSO READ : బంగ్లాదేశ్ పై భారత్ కొత్త ఆంక్షలు..
ఇదే క్రమంలో టాటా మోటార్స్ తమ వాహనాల్లో E20 ఆయిల్ వాడొచ్చని ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పింది. ఇక దేశంలోని టాప్ టూవీలర్ తయారీదారు బజాజ్ బీఎస్3 కంటే పాతవాహనాల యజమానులు బండిలోని ఫ్యూయెల్ సిస్టమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందని సూచించింది. టూవీలర్ సంస్థలు E20 ఆయిల్ సపోర్ట్ చేసే వాహనాలకు ఇంధన్ ట్యాంకుల వద్ద దానిని సూచిస్తూ E20 స్టిక్కర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా E20 ఫ్యూయెల్ వల్ల నష్టాలను భర్తీ చేయవనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది.
పరిష్కారం ఏంటి..?
దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హెచ్ పీ ఆయిల్ ఇథనాల్ మిక్స్ చేయని పెట్రోల్ అమ్ముతున్నాయి. దీనినే 100 octane పెట్రోల్ అని అంటారు. దీని రేటు లీటరుకు రూ.160గా ఉంది. ఇలా వాహన ఇంజన్లకు ఎలాంటి హాని కలిగించదు. పైగా ఈ ఆక్టేన్ పెట్రోల్ వాడటం ద్వారా స్పీడ్, మైలేజ్, ఇంజన్ లైఫ్ మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ దీనిని XP 100 పేరుతో విక్రయిస్తోంది.