కీలక పోస్టుల్లో రిటైర్డు బాసులు

కీలక పోస్టుల్లో రిటైర్డు బాసులు

60 ఏండ్ల వయసు దాటినా… అదే పోస్టులో 54 మంది

తమ చెప్పుచేతల్లో పని చేసే ఆఫీసర్లను కేసీఆర్ ప్రభుత్వం అడ్డదారిలో అందలమెక్కిస్తోంది. సర్వీసు టైమ్ పూర్తయిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, డిపార్టు మెంట్ హెడ్లను ఇంటికి సాగనంపకుండా.. తిరిగి అదే పోస్టుల్లో కొనసాగిస్తోంది. ఏడాది, రెండేండ్లు కాదు.. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ కొందరు రిటైర్డ్​ ఆఫీసర్లకు ఎక్స్ టెన్షన్ కొనసాగిస్తూనే ఉంది. సర్వీస్ రూల్స్ తిర్రమర్ర చేసి కొందరికి తిరిగి అదే హోదాలో కాంట్రాక్టు పోస్టిం గ్ ఇచ్చేస్తోంది. దీంతో తెలంగాణలో రిటైర్డ్​ ఆఫీసర్ల హవా నడుస్తోంది. అటు సీఎంవోతో పాటు ఇటు అసెంబ్లీలో, మరోవైపు కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన డిపార్టు మెంట్లు, స్కీములన్నింటా రిటైరైనోళ్లే సీట్లకు అతుక్కు పోయారు. ఒక కమ్యూనిటీకి చెందిన ఆఫీసర్లను కీల పోస్టుల్లో ఉంచేందుకే కేసీఆర్ సర్కార్​ ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నాయి. అయినా.. అదేమీ లెక్కచేయకుండా జూన్ నెలాఖరున రిటైరైన ఓ ఐపీఎస్ ఆఫీసర్​కు , జులై నెలాఖరున రిటైరైన మరో డిపార్ట్​మెంట్ హెడ్ కు ఎక్స్ టెన్షన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం లో దాదాపు 54 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ప్రస్తుతం తమ పాత పోస్టుల్లో నే కొనసాగుతున్నారు. వీరిలో 11 మంది ఐఏఎస్‌ లు, ముగ్గురు ఐపీఎస్‌లు, ఒక ఐఎఫ్‌‌ఎస్‌ , ఒక ఐఈఎస్‌ అధికారి తోపాటు వివిధ డిపార్ట్ మెంట్లలో 31 మంది హెచ్‌‌వోడీలు, లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ అడ్వైజర్‌‌ ఒకరు, జిల్లా ల్లో ఐదుగురు అడిషనల్‌‌ కలెక్టర్లు , ఒక స్పెషల్‌‌ ఆఫీసర్‌‌ ఉన్నారు. వీళ్లంతా ఎప్పుడో రిటైర్డ్​ అయ్యి ఎక్స్​టెన్షన్​పై అవే పోస్టులను అనుభవిస్తున్నారు.

సీఎంవో నుంచి అసెంబ్లీ దాకా!

సీఎంవో ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ నర్సింగరావు ఎక్స్​టెన్షన్​లో కొనసాగుతున్నా రు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావటంతో రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ అదే పోస్టులో ఉన్నా రు. తెలంగా ణ తొలి సీఎస్​గా పనిచేసిన రాజీవ్ శర్మ.. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌‌ అడ్వయిజర్ పోస్టులో కొనసాగుతున్నారు. ఐఏఎస్ ల పోస్టింగ్​లు, బదిలీలన్నింటా తెర వెనుక ఆయనే చక్రం తిప్పుతారని ప్రభుత్వవర్గాల్లో ప్రచారంలో ఉంది. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ భూపాల్ రెడ్డి సీఎంవో సెక్రటరీగా ఉన్నారు. రిటైర్డ్‌‌ సీఎస్‌ శైలేంద్రకుమార్‌‌ జోషిని ప్రభుత్వం కొన్ని నెలల కిందట ఇరిగేషన్‌‌ అడ్వయిజర్‌‌గా నియమించిం ది. రిటైర్డ్‌‌ ఐఏఎస్‌లు కేవీ రమణాచారి, ఏకే గోయల్‌‌, రామలక్ష్మణ్‌ ఐదేండ్లుగా గవర్నమెంట్ అడ్వయిజర్లుగా ఉన్నారు. ఫైనాన్స్‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో రిటైర్డ్‌‌ ఐఏఎస్‌ ఆఫీసర్ శివశంకర్‌‌ను కన్సల్టెంట్‌‌గా , మరో రిటైర్డ్‌‌ ఆఫీసర్ జీఆర్‌‌ రెడ్డిని అడ్వయిజర్‌‌గా ఎక్స్‌ టెన్షన్‌‌పై కంటిన్యూ చేస్తున్నా రు. ఫైనాన్స్ లో కీలకమైన బిల్లుల చెల్లింపులు, బడ్జెట్ వ్యవహారాలు చక్కదిద్దే అడిషనల్‌‌ సెక్రటరీ పోస్టులో రామ్మోహన్‌‌రావు ఎక్స్‌ టెన్షన్‌‌లో కొనసాగుతున్నారు. రిటైర్డ్‌‌ ఐఏఎస్ ఆఫీసర్ సత్యనారాయణకు సప్లైస్ కమిషనర్‌‌ బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్‌ ఆఫీసర్ అనిల్‌‌ కుమార్ ను రిటైరయ్యాక దేవాదాయశాఖ కమిషనర్ గా ఎక్స్‌ టెన్షన్‌‌లో కొనసాగిస్తున్నా రు. రిటైర్డ్‌‌ ఐఏఎస్‌ ప్రియదర్శిని ప్రస్తుతం కేజీబీవీల స్టేట్‌‌ కో ఆర్డినేటర్‌‌గా ఉన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహా చార్యులు పదవీకాలం గత ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఎక్స్ టెన్షన్​పై అదే హోదాలో ఉన్నారు. బంధుప్రీతి వివాదం మాజీ డీజీపీ అనురాగ్‌ శర్మను హోం శాఖ అడ్వయిజర్ గా , రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఏకే ఖాన్‌‌‌‌‌‌‌‌ మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ అడ్వయిజర్‌‌‌‌‌‌‌‌గా , మరో ఐపీఎస్‌ ఆఫీసర్ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావును హోం శాఖ ఓఎస్డీగా నియమించారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు జూన్‌‌‌‌‌‌‌‌ నెలా ఖరున రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఆయనను వెంటనే మరో హోదాలో నియమించటం రాజకీయంగా వివాదాస్పదమైంది. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు బంధువు కావడంతోనే ఆయనకు ఎక్స్​టెన్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రిటైరైనోళ్ల చేతుల్లో సెక్రటేరియట్ కూల్చివేత!

చెక్కుచెదరని వారసత్వానికి అద్దం పట్టిన సెక్రటేరియట్ బిల్డింగ్​లను కూల్చి వేయటంతోపాటు.. కొత్త సెక్రటేరియట్ కట్టడంలోనూ రిటైర్డ్ ఆఫీసర్ల హస్తముంది. కేసీఆర్ అనుకున్నట్లుగా , ఆశించినట్లుగా సెక్రటేరియట్ కూల్చే ప్లాన్, కొత్తగా కట్టే డిజైన్లను రూపొందించటంలో ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ బీ డిపార్టుమెంట్ కు చెందిన ఇద్దరు ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌‌‌‌‌‌‌‌రావు పేర్లే ప్రధానంగా వినిపించాయి. వీరిద్దరూ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లే. పాత బిల్డింగ్‌ పరిపాలనకు అనుగుణంగా లేదని తేల్చి చెప్పిన టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌ పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీని గణపతిరెడ్డి లీడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేస్‌ బాధ్యతలు చూసే గణపతిరెడ్డి అనేక కీలక రోడ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల్లో సర్కారుకు అనుగుణంగా అంచనాలు రూపొందించారు. గత ఐదేండ్లుగా ఆయన ఎక్స్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా రు. రవీందర్‌‌‌‌‌‌‌‌రావు స్టేట్‌‌‌‌‌‌‌‌ రోడ్స్‌ బాధ్యతలు చూస్తారు. ఆయనకు రెండేండ్ల కింద ఎక్స్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.

ఎలక్ట్రిసిటీ లో బంధుమిత్రులే

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఐఏఎస్‌ ఆఫీసర్లనే సీఎండీలుగా నియమించాల్సి ఉండగా రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు దేవులపల్లి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు, రఘుమారెడ్డి, గోపాల్‌‌‌‌‌‌‌‌రావు ఏండ్లకేండ్లుగా కొనసాగుతున్నా రు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సన్నిహి తుడైన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీకాంతారావుకు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు బంధువు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు, రఘుమారెడ్డి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎక్స్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, గోపాల్‌‌‌‌‌‌‌‌రావును గతేడాది ఎక్స్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌పై నియమించారు. ఎన్పీడీసీఎస్‌ , ఎస్పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లుగా రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లేనే నియమిస్తారు. ఈ పోస్టుల్లో బి.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, గణపతి, నర్సింగరావు, శ్రీనివాస్‌ రెడ్డి, టి.శ్రీనివాస్‌, జగత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సూర్యప్రకాశ్‌, పర్వతం , మోహన్‌‌‌‌‌‌‌‌రావు, పి. నర్సింహారావు ఉన్నారు.

వాటర్బోర్డు, హెచ్ ఎండీఏలోనూ..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో వాటర్బోర్డు ఎగ్జిక్యూటివ్డైరెక్ట ర్గా ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్లో సత్యనారాయణ కొనసాగుతున్నారు. వాటర్ బోర్డులోని అన్ని విభాగాలపైనా ఆయన పెత్తనం కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేండ్లుగా సత్యనారాయణను కంటిన్యూ చేస్తున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీ ర్బీ ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్రెడ్డి ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్లో కొనసాగుతున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ ప్రాజెక్టులను ఫైనల్ చేసే బాధ్యతల్లోనూ రిటైర్డ్ ఇంజనీర్నే కొనసాగిస్తున్నారు.

జిల్లాల్లో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లుగా..

జిల్లా ల్లోనూ రిటైర్ డ్ఆఫీసర్లు అడిషనల్ కలెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఎస్‌.పద్మాకర్‌‌‌‌ (సిద్దిపేట), వై. సురేందర్‌‌‌‌రావు (మంచిర్యాల), ఎస్‌ .దయానంద్‌ (వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌), ఆర్‌‌‌‌. మహేందర్‌‌‌‌రెడ్డి (వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌), డి. యాదిరెడ్డి (కామారెడ్డి), గడా స్పెషలాఫీసర్‌‌‌‌గా రిటైర్డ్‌‌‌‌ ఆర్డీవో ముత్యంరావు ఎక్స్‌ టెన్షన్‌‌‌‌లో పనిచేస్తున్నారు.

నల్లా నీళ్లు.. గొర్రెల స్కీమ్‌ లకూ వాళ్లే

హార్టి కల్చర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌గా ఎక్స్‌టె న్షన్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్న వెంకట్రామ్‌ రెడ్డి మంత్రి ఈటల వియ్యంకుడు. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మారెడ్డికి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయిన తర్వాత ఎక్స్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. గొర్రెల పంపి ణీ స్కీమ్ అంతా ఈయన కనుసన్నల్లో సాగడంతో మంత్రి తలసాని ఈయనను మళ్లీ అదే పోస్టులో ఉంచేం దుకు పట్టుబట్టినట్లు ప్రచారంలో ఉంది. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి రిటైర్డ్ ఆఫీసరే. రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు నందారావు, మనోహర్‌‌‌‌‌‌‌‌బాబు, సురేశ్‌ కుమార్‌‌‌‌‌‌‌‌, జగన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్‌ ఈఎన్సీగా సత్యనారాయణరెడ్డి రెండేండ్లుగా ఎక్స్‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌పైనే ఉన్నారు. పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రామారావు రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అధికారులే.

ఇరిగేషన్ సార్కు ఆరోసారి..

ఇరిగేషన్‌‌ ఈఎన్సీగా రిటైర్డ్‌‌ ఇంజనీర్ మురళీధర్‌ ఉమ్మడి ఏపీ నుంచే ఎక్స్‌‌టెన్షన్‌‌లో కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈయనకు వరుసగా ఆరోసారి ఎక్స్‌‌టె న్షన్‌‌  ఇచ్చింది. చివరిసారి ఇచ్చిన ఎక్స్‌‌టె న్షన్‌‌  ఆర్డర్‌ లో గడువు కూడా పేర్కొనలేదు. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈయనే ఈఎన్సీగా కొనసాగనున్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌, కాం ట్రాక్టర్లతో ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేయడంలో మురళీధర్​ కీలకమనే ఆరోపణలున్నాయి. కాళేశ్వరం నిర్మాణంలో వచ్చిన విమర్శలు, టెండర్ల అప్పగింతలు, అంచనాల పెంపు వ్యవహారాలన్నీ ఈయన కనుసన్నల్లోనే జరిగినట్లు ప్రచారంలో ఉంది. కాళేశ్వరం ఈఎన్సీగా రిటైర్డ్‌‌ సీఈ నల్లా వెంకటేశ్వర్లును ఎక్స్‌‌టె న్షన్‌‌పై కంటిన్యూ చేస్తున్నారు. వీరిద్దరూ సీఎంకు సన్నిహితంగా ఉంటారు. కృష్ణా బేసిన్‌‌ సీఈ హమీద్‌‌ ఖాన్‌‌, నాగార్జున సాగర్‌ సీఈ నర్సింహా రిటైర్డ్‌‌ ఇంజనీర్‌ లే. లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ అడ్వయి జర్‌ గా రిటైర్డ్​ ఆఫీసర్​ పెంటారెడ్డి కొనసాగుతున్నారు.