కరీంనగర్ టౌన్: రిటైర్డ్ పోలీసు అధికారులు కుట్ర పన్ని తనను అక్రమంగా కేసులో ఇరికించారని రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య ఆరోపించారు. కరీంనగర్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రిటైర్డ్ పోలీసు అధికారులు ఎస్ఐబీలో పనిచేస్తూ తమకు నచ్చని వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. వెంటనే వారిని తొలగించి, ఆయా స్థానాల్లో యువతకు అవకాశం కల్పించాలి.
తనకు తీన్మార్ మల్లన్న టీమ్ కు ఇప్పటినుంచి ఎలాంటి సంబంధం లేదన్నారు దాసరి భూమయ్య. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ప్రతిమ కన్ స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అక్రమంగా 200 ఎకరాల మట్టిని మిడ్ మానేర్ లో పోయించారు. బీఆర్‌ఎస్ ప్రభత్వానికి ప్రజలు వాతలు పెడ్తారు. తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా’ అని దాసరి భూమయ్య తెలిపారు.